యూరియా విషయంలో రైతులు అధైర్యపడకూడదు
చేగుంట ఆగస్ట్ 21,విజయక్రాంతి: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ తాడెం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడతూ.. యూరియా కేంద్రలలో ఎలాంటి సమస్య ఉన్న చైర్మన్ కి గాని, డైరెక్టర్ లకు సంప్రదించాలని రైతులు ఎవరు అధైర్య పడకూడదని అన్నారు , అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మార్కెట్ కార్యాలయంలో సీసీ రోడ్డు, వాటర్ ప్లాంట్, షేడ్, బాత్రూం గురించి అభివృద్ధి కార్యక్రమ లకు తీర్మానం చేసి నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, , కుర్మ లక్ష్మి, బల్ రెడ్డి, లక్ష్మణ్ సెట్, రమేష్ సెట్,తదితరులు పాల్గొన్నారు.






