2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

పీకే సాధించిన సీట్లు జీరో

15-11-2025 01:41 AM
  1. జన్ సూరజ్ పార్టీకి ఘోర పరాభావం

ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నా.. ఓటమి

పాట్న, నవంబర్ 14: దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిశోర్(పీకే) సొంత రాష్ట్రంలో ఓడిపోయారు. తొలి ప్రయత్నంలోనే ఘోర పరాభావాన్ని చవిచూశారు. ‘చాయ్ పే చర్చా, కాఫీ విత్ కెప్టెన్’ వంటి నినాదాలు, సర్వేలు, సోషల్ మీడియా ప్రచార వ్యూహాలతో అనేక పార్టీలకు అధికారం కట్టపెట్టడంలో కీలక రోల్ పోషించిన ఆయన సొంత రాష్ట్రంలో గెల్వలేకపోయారు.

బీహార్‌లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసిన జన్‌సురాజ్ పార్టీ బోణి కొట్టలేదు. 3.5 శాతం ఓట్లతో అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. దేశ రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్తగా చక్రం తిప్పిన ప్రశాంత్‌కిశోర్.. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, పంజాబ్, ఏపీలో, బెంగాల్‌లో వినూత్న విధానాలతో దాదాపు అందర్నీ విజయాల మీద కూర్చోబెట్టిన పీకే సొంత రాష్ట్రంలో మాత్రం ఒడిపోయారు.

పోటీకి దూరంగా ఉన్న పీకే .. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని హామీలు ఇచ్చినా ఆయనను ఓటర్లు నమ్మలేకపోయారు. బలమైన నేతలు లేకపోవడం, పార్ట క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండడం, చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జన్ సురాజ్ పార్టీకి ప్రతి కూలంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ, నితీశ్ కుమార్ వ్యూహాల ముందు గెలవలేకపోయారు.