2 July, 2026 | 6:00 PM

భిక్కనూర్ శివారులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

02-07-2026 05:04 PM

భిక్కనూర్, జూలై 2(విజయ క్రాంతి): భిక్కనూర్ శివారులో గురువారం గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన శంకర్ (48) ఆటోలో భిక్కనూరుకు వస్తుండగా ఒక్కసారిగా తీవ్ర ఛాతినొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.