అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పార్లమెంట్‌లో 200వ జయంతి ఉత్సవాలు
నివాళి అర్పించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే అని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఫూలే 200 వ జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్లో ఉన్న ప్రేరణా స్థల్ ఫూలే విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్రపతి సేవలను కొనియాడారు. సా మాజిక అడ్డంకులను తొలగిచేందుకు ఫూలే కృషి చేశారని పేర్కొన్నారు.
మహిళా విద్య కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. కుల వివక్షను రూపుమాపడానికి, అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని శ్లాఘించారు. నివాళి అర్పించిన వారిలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృ ష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మం త్రులు అర్జున్ రామ్ మేఘవాల్, జేపీ నడ్డా తదితరులు ఉన్నారు.
తర్వాత, కొద్దిసేపటికి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాం ధీ కూడా ప్రేరణ స్థల్ వద్దకు వచ్చారు. ఫూలే విగ్రహానికి నివాళి అర్పించారు. సమా నత్వం, సామాజిక న్యాయం కోసం ఫూలే జీ వితాంతం పోరాడారని ఆయన ఫూలే సేవలను గుర్తుచేసుకున్నారు. పేదల హక్కుల రక్షణ కోసం, వివక్షపై పోరాటం కోసం ఫూలే తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
మోదీ, రాహుల్ మాటామంతి!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించారు. రాజకీయ వేదికలపై ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచు పడే వీరిద్దరి ఈ సంభాషణ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. శనివారం జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలోని ఉన్న ప్రేరణా స్థల్‌లోని ఫూలే విగ్రహానికి వారు నివాళులర్పించారు.
అనంతరం ప్రధాని అందరికీ నమస్కరిస్తూ ముందుకు నడిచారు. తిరిగి వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ఏదో అన్నా రు. అనంతరం రాహుల్ గాంధీ కూడా అవునన్నట్లు తలుపుతూ ప్రధానికి వివరణ ఇచ్చా రు. వీరిద్దరి మధ్య సంభాషణ కొద్దిసేపే జరిగినప్పటికీ సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది.




