శాంతి చర్చల్లో పేలిన షరతులు!
- ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా భేటీ
- విభేదాలు, షరతులతో చర్చలు ఆలస్యం
- ఇరు దేశాల ప్రతినిధులతో పాక్ ప్రధాని షరీఫ్ విడివిడిగా భేటీ
- లెబనాన్‌పై దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్
- దాడులు కొనసాగించిన ఇజ్రాయెల్
- ఇతర దేశాల్లో స్తంభించిన తమ నిధులు క్లియర్ చేయాలని ఇరాన్ హుకుం
- కేవలం ఖతర్‌లో నిలిచిన 6 బిలియన్ డాలర్ల విడుదలకు సిద్ధమన్న అమెరికా
- ఇరు దేశాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
- మరో రోజూ చర్చలు ?
ఇస్లామాబాద్, ఏప్రిల్ ౧౧: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్ వేది కగా శనివారం అమెరికా - ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిగా శాంతి చర్చలు జరిగినా ఫలి తం తేలలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అమెరికాతోపాటు ఇతర దేశాల్లో స్తంభించిన తమ నిధులను బేషరతుగా విడుదల చేయాలని ఇరాన్ బృందం కోరింది. అయి తే ఖతార్‌లో స్తంభింపజేసిన 6 బిలియన్ డాలర్లను మాత్రమే విడుదల చేసేందుకు అమెరికన్ బృందం అంగీకరించింది.
ఇరాన్ అందుకు అంగీకరించలేదు. ఒక్క ఖతార్ నుంచే కాక, అన్ని దేశాల్లోనూ నిలిచిన నిధులన్నీ విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడినట్లు తెలిసింది. దీంతో చేసేదేం లేక చర్చలను మరో రోజుకు చర్చలు పొడిగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు, ముందస్తు షరతుల కారణంగా భేటీ సుమారు ఐదు గంటలు ఆలస్యమైంది. ఇరుదేశాల మధ్య సంధానకర్తగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యవహరించారు.
రెండు దేశాల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యా రు. ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పలువురు సైనిక, ఆర్థిక రం గ ప్రతినిధులు, అమెరికా తరఫున దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రభుత్వ ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ హాజరయ్యారు. అమెరికా రెండు ముందస్తు షరతులను అంగీకరిస్తేనే చర్చలు ప్రారంభిస్తామని ఇరాన్ బృందం చర్చలకు ముందే తెగేసి చెప్పింది.
హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలని ఇరాన్ కోరుతున్నది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నా ఇజ్రాయెల్ ఎప్పటిలాగే లెబనాన్‌పై దాడులు కొనసాగించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కూ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నది. ఇరు దేశాల డిమాండ్లు శాంతి చర్చల్లో ఎంతవరకు చర్చకు వస్తాయి.. ఎంతవరకు నెరవేర తాయనేది ఉత్కంఠ రేపుతున్నది.
ఇతర దేశాధినేతల చొరవ
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని లెబనాన్‌కూ వర్తింపజేయాలని అమెరికాను కోరారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఫోన్‌లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో సంభాషించారు. హోర్ముజ్ జల సంధి తెరిపించాలని, కాల్పుల విరమణను గౌరవించాలని ఆయన కోరారు.
హోర్ముజ్ వద్ద హైడ్రామా
ఒకవైపు ఇస్లామాబాద్‌లో ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు సాగుతున్న వేళ హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. అమెరికాకు చెందిన రెండు (గైడెడ్ మిస్త్స్రల్ డిస్ట్రాయర్లు) యుద్ధ నౌకలు జలమార్గాన్ని దాటినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. దీనిపై ఇరాన్ వాదన భిన్నం గా ఉంది. కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే జలసంధి వైపు వచ్చిందని, తాము హెచ్చరికలు జారీచేయడంతో నౌక వెనుదిరిగిందని ఇరాన్ సైన్యం చెబుతున్నది.
అంతే సంగతులు: ట్రంప్
చర్చలు ఏ దిశగా సాగుతాయనేది తామిప్పుడే చెప్పలేమని అమెరికా అధ్యక్షుడు ట్రం ప్ పేర్కొన్నారు. ఇరాన్ ఎంతవరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందనేది తమకు ఒక అం చనా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే తమ విధానాన్ని పూర్తిగా మార్చుకుంటామని, ఇక ఇరాన్‌ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. నౌకల నుంచి ఇరాన్ ట్రాన్సిట్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు.
ఎవరి సాయం లేకుండానే తాము జలసంధిని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా చైనా, జపా న్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ వంటి అనేక దేశాలకు మేలు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థలైన రష్యా, సౌదీ అరేబియా కం టే అమెరికాలోనే ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఖాళీ చమురు ట్యాంకర్లన్నీ అమెరికా తీరాల వైపు వస్తున్నాయని పేర్కొన్నారు. తమ దేశం నుంచి నాణ్యమైన చమురు, ఎల్పీజీ ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
పట్టు విడుపుల్లేవ్
చర్చల ద్వారా హోర్ముజ్ జలసంధి సత్వరం తెరుచుకుంటుందని అమెరికా భావించినట్లు కనిపిస్తున్నది. ఇరాన్‌లోని యురేనియం నిల్వలను అప్పగించాలని, క్షిపణి పరీక్షలను నిలిపివేయాలని అమెరికా కోరుతున్నది. అలాగే, ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న అమెరికన్ పౌరులను విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నది.
లెబనాన్ వివాదానికి, ఈ చర్చలకు సంబం ధం లేదని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. ఇరాన్ పది ప్రతిపాదనలకు, అమెరికా ప్రతిపాదించిన 15 అంశాలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిపై తమ కు పూర్తి అధికారం ఉండాలని, రవాణా రుసుము వసూలు చేసే హక్కు కావాలని ఇరాన్ కోరుతున్నది.




