19 June, 2026 | 3:30 AM

సెంచరీతో ఆదుకున్న ఫిలిప్స్

19-06-2026 01:00 AM

ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్

లండన్, జూన్ 18 : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆల్‌రౌండ ర్ గ్లెన్ ఫిలిప్స్ న్యూ జిలాండ్‌ను ఆదుకు న్నాడు. అద్భుత సెంచరీతో జట్టుకు భారీస్కోరు అందిం చాడు. బ్యాటింగ్ పిచ్‌పై కివీస్ 188 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిం ది. ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్, వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

రెండో రోజు ఆటలో మాత్రం ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 133 బంతుల్లో ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడు సరిగ్గా 100 పరుగులు చేసి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది.