24 March, 2026 | 11:44 AM

Breaking News

షాద్‌నగర్‌లో పెట్రోల్ కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు

24-03-2026 12:00 AM

షాద్నగర్ మార్చి 23 (విజయక్రాంతి): షాద్నగర్ పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డీజిల్ మాత్రం అందుబాటులో ఉన్నప్పటికీ, పెట్రోల్ కోసం ప్రజలు ఒక బంక్ నుంచి మరో బంక్కు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వ సెలవుదినాల నేపథ్యంలో సరఫరాలో ఆలస్యం జరిగిందని బంక్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయా...? రాష్ట్రంలోని కొరత ఏర్పడిందా...? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.పెట్రోల్ బంక్ యాజమాన్యాల ప్రకారం, కొత్త స్టాక్ కోసం ట్యాంకర్లు ఇప్పటికే బయలుదేరినట్లుతెలుస్తోంది.అయితే అక్కడ కూడా సరఫరా పరిస్థితి ఎలా ఉందో స్పష్టత రావాల్సి ఉంది.ఈ నేపథ్యంలో షాద్నగర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.త్వరగా సరఫరా పునరుద్ధరించాలని వాహనదారులుకోరుతున్నారు.అధికారులు ఈ సమస్యపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.