పెట్రోల్ ధరలను తగ్గించాలి
- సీపీఐ నేతల డిమాండ్
- హనుమకొండలో తాళ్లతో ఆటోను లాగుతూ నిరసన
వరంగల్, మే 15 (విజయక్రాంతి) : పెం చిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హనుమకొండ నగరంలోని కాళోజీ సెంటర్‌లో సీపీఐ నేత లు తాళ్లతో ఆటోలను లాగుతూ నిరసన తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ల పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యు లు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో మరిం త భారం పడుతున్నదన్నారు.
పది రోజుల క్రితం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను భారీగా పెంచి కనికరం లేకుండా సా మాన్య ప్రజలపై కేంద్రం ఆర్థిక భారం మో పిందన్నారు. కార్పొరేట్ వర్గాలకు నరేంద్ర మోదీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదన్నారు. గడిచిన 12 ఏ ళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శ క్తుల కనుసన్నల్లో పాలకులు ముందుకు సా గుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అ య్యారని ఆరోపించారు.
పె ట్రోల్, డిజీల్ ధ రలను వెంటనే తగ్గించని ఎ డల ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరిం చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహా య కార్యదర్శి తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఎన్.ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, గుం టీ రాజేందర్, అలువాల రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.






