19 May, 2026 | 11:05 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేత

03-01-2026 06:52 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలోని కేజీబీవీ పరిశీలనకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పాఠశాలల్లోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని శనివారం పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వర్షం వచ్చిన ప్రతిసారి పాఠశాల ఆవరణలోకి మోకాళ్ళలోతు వర్షపు నీరు చేరి విద్యార్థినీలు నానా అవస్థలు పడుతున్నారు.

వర్షం వచ్చిన ప్రతిసారి పాఠశాలకు సెలవులు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. పాఠశాల సమస్యలపై అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా నిమ్మకు నిరత్తనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో వజ్జె సాయి,నవీన్,మహేష్ తదితరులు ఉన్నారు.