17 April, 2026 | 3:21 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం

17-04-2026 02:00 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో తంగళ్ళపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్నం 1 గంటకు వినతిపత్రాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.