రెండు గ్రామాల్లో పిరియాడిక్ లేబర్ సర్వే
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి, గుండన్నపల్లె గ్రామంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చేస్తున్న కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్న సర్వేల్లో భాగంగా స్తంభంపల్లి, గుండెనపల్లె, గ్రామంలో గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో భాగంగా మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ట్యాబ్ ద్వారా గ్రామములో కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి, మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని గుర్రం శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు.
తొలి విడతలో కుటుంబ యజమాని పేరు సభ్యులు వారి విద్యా అర్హతల గురించి చదువు మానేసిన ఉన్నత చదువులు వృత్తివిద్య కోర్సులు ఉద్యోగం స్వయం ఉపాధి వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో ఎన్ని గంటలు పని చేశారో ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని గుర్రం శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోయినపల్లి ఎంపీడీవో భీమ జయశీల, పంచాయతీ కార్యదర్శులు మౌనిక, ఎండి జాఫర్ హైమద్ , గ్రామ సర్పంచులు బోనగాని అశోక్ గౌడ్, కొప్పుల లావణ్య నగేష్ ఉప సర్పంచ్ చంద్రగిరి అశోక్, చిలువేరి కిషన్, వార్డ్ మెంబర్స్ అంగన్వాడి టీచర్స్ , అక్కనపల్లి నీలమ్మ అక్కనపల్లి భాగ్య, నంది భారతి ,ఆశ వర్కర్స్ ఎర్ర చంద్రకళ ,నంది హిమబిందు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




