18 March, 2026 | 6:33 PM

అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు

18-03-2026 04:49 PM

హనుమకొండ,(విజయక్రాంతి): చెన్నైలోని జాయ్ వ్యవసాయ అగ్రిటెక్ విశ్వవిద్యాలయంలో మార్చి 26, 27 తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ అగ్రిటెక్ వ్యవసాయ సదస్సుకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు ఆహ్వానం పొందారు. జర్నలిజం విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ ఎల్.జితేందర్ సంయుక్తంగా సిద్ధం చేసిన “వ్యవసాయ ఆర్థిక శాస్త్రం – సుస్థిర అభివృద్ధి” అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సదస్సులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ అంతర్జాతీయ సదస్సులో వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆధునిక అగ్రిటెక్ విధానాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలపై ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొని తమ పరిశోధనలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, డాక్టర్ ఎల్.జితేందర్‌లను కళాశాల అధ్యాపక వర్గం, విద్యార్థులు, సిబ్బంది అభినందించారు.