16 May, 2026 | 12:50 AM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

16-05-2026 12:13 AM

ఎడ్యుకేషన్ డే సందర్భంగా పుస్తక ప్రదర్శన

దోమకొండ, మే 15(విజయ క్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల శాఖా గ్రంథాలయంలో శుక్రవారం ఎడ్యుకేషన్ డే సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువతకు మోటివేషన్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరేణి నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్. వంశీకృష్ణ, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, సీనియర్ సిటిజన్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.