27 March, 2026 | 3:51 AM

ఘనంగా కామర్స్ మేనేజ్‌మెంట్ మీట్ ఆవిష్కార్ 2కే26

27-03-2026 02:02 AM

ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో నిర్వహణ

కరీంనగర్, మార్చి 26(విజయక్రాంతి): కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ అం డ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర స్థాయి కామర్స్, మేనేజ్‌మెంట్ మీట్ ఆవిష్కార్ 2కే26 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఆల్ఫో ర్స్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ అధినేత వీ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వి రవీం దర్ రెడ్డి మాట్లాడుతూ, ఆల్ఫోర్స్ సంస్థ ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి తమ టాలెంట్‌ను వెలికితీసుకునే అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యంగ్ మే నేజర్, యంగ్ కామర్స్ అవార్డ్, కార్పొరేట్ వాక్, స్ట్రెస్ ఇంటర్వ్యూ, నర్తన శాలతో పాటు 19 రకాల కాంపిటీషన్స్ నిర్వహించామని, 15 కాలేజీ విద్యార్థులు తమ ప్రతిభని ప్రదర్శించారన్నారు.

వీ నరేందర్ రెడ్డి తన ప్రసం గంలో యువత చదువుతో పాటు వివిధ కా ర్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి ఆ త్మవిశ్వాసం ముఖ్యమన్నారు.లయన్ కెప్టెన్ బీ మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ  నేటి యువతిలో ఎంతోమంది మహిళలు విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్లుగా నిలుస్తు న్నారని, వారు తమ ప్రతిభతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

ముగిం పు సమావేశానికి గౌరవ అతిథిగా శాతవాహన యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగ అధిపతి డాక్టర్ హరికాంత్ విచ్చేసి, ఫైనల్ లెవెల్ పోటీలకు ఎంపి కైన విజేతలలో హన్మకొండ కి చెందిన వాగ్దే వి డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఓవరాల్ ఛాంపియన్ షిప్ తో పాటు వివిధ పాటవ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.  కరెస్పాండెంట్ వీ రవీందర్ రెడ్డితో పాటు  ముఖ్య అతిథి వీ నరేందర్ రెడ్డి, బీ మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగ అధిపతి డాక్టర్ హరికాంత్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్, పాల్గొన్నారు.