calender_icon.png 18 February, 2026 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి కాలంలో ప్రజలు ఆరుబయట నిద్రించొద్దు

18-02-2026 09:28:24 PM

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండండి భద్రతే ప్రధానం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రానున్న వేసవికాలం ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ ప్రజలు ఆరుబయట రాత్రి వేళలో నిద్రించవద్దని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... మండలంలోని ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు. ఎందుకంటే ఎండాకాలం సమయంలో రాత్రివేళల్లో చాలా మంది ఇంటి బయట లేదా ఇంటి మీద (టెర్రస్‌పై) నిద్రించే పరిస్థితి ఉంటుంది. ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగలకు ఇది అనుకూల సమయం కావచ్చు. అందువల్ల ఎండాకాలం సమయంలో దొంగతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కాబట్టి మండలంలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఇంటి తలుపులు, కిటికీలు బాగా మూసివేయాలి. విలువైన వస్తువులు సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రాత్రి వేళల్లో అపరిచితులను ఇంటి వద్ద అనుమతించకూడదు.అలాగే గ్రామ సర్పంచులు బాధ్యత తీసుకుని గ్రామంలో ముఖ్య ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. గ్రామ రక్షణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రజల సహకారంతోనే దొంగతనాలను నివారించగలమని ఎస్ఐ భార్గవ్ గౌడ్ పేర్కొన్నారు.