18 May, 2026 | 2:26 AM

నోటి మాటలే... అమలుకు అడుగులు పడట్లే

18-05-2026 01:41 AM
  1. గ్రామాల మధ్య వాగులకు కల్వర్టు బ్రిడ్జిల్లా నిర్మాణం ఎక్కడ?
  2. నేతల మాటలు కోటలు దాటిన పనులు జరగట్లే 
  3. అసహనం వ్యక్తం చేస్తున్న జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు 
  4. వస్తున్నది వర్షకాలం.. రాకపోకలు ఎట్లా!

జడ్చర్ల, మే 17 : నేతల మాటలు కోటలు దాటుతాయి.. మైకు చేతికి అందితే అందర్నీ మైమరిపించేలా మాట్లాడతారు.. ఆచరణ విషయానికి వస్తే ఆమడ దూరంలో ఉంటున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో పలు గ్రామాలలో వాగుల పైనుంచి వివిధ గ్రామాలకు జనం రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ తరుణంలో కొంతమంది వర్షాకాలంలో వాగులు దాటేందుకు పోయి ప్రాణాలు పో గొట్టుకున్న పరిస్థితులు కూడా లేకపోలేదు.

ఈ తరుణంలో ప్రజా ప్రతినిధులు వారి ఇంటి దగ్గరికి వెళ్లి ఓదార్చి వెంటనే బ్రిడ్జిలు నిర్మాణం కల్వర్టుల నిర్మాణం చేపట్టి రోడ్లు వేసి జనానికి రాకపోకలకు ఇబ్బందులు లే కుండా రాబోయే వర్షాకాలం తీసుకువస్తామని చెప్పడమే కానీ చేయడంలో ఆమడ దూరంలో ఉన్నారని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు చెబుతున్న మాట. అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడుపుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్ల పైగా అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలకు వాగులు వంకలు అడ్డుగా ఉన్నప్పటికీ నిర్మాణాలు నిర్మాణాల జాడే లేదు. అతి తక్కువ ప్రాంతంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని అత్యధిక ప్రాంతా ల్లో జనం వర్షాకాలం వస్తే భయపడే పరిస్థితిలో ఉన్నాయని జడ్చర్లలో హార్ట్ టాపిక్ గా మారింది. 

 నియోజకవర్గంలో ఇలా...

 జడ్చర్ల నియోజకవర్గంలో అత్యవసర పరిస్థితుల్లో వర్షాకాలంలో రాకపోకలు నిలి చే రోడ్లకు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంలో విజయక్రాంతి దినపత్రిక వివిధ రోడ్ల ను తెరపైకి వస్తుంది. ఈ ప్రాంతంలో అవసరమైన ప్రాంతాలలో కల్వర్టు బ్రిడ్జిల నిర్మా ణం చేపడితే జనానికి మేలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

పోలేపల్లి కిష్టా రం మధ్య, కిష్టారం దొడ్డిపల్లి గ్రామాల మ ధ్య గల చిన్న చెరువు వెనుక గల , దొడ్డిపల్లి గ్రామం సమీపంలో, రుద్రారం గ్రామం లో,రుద్రారం నుంచి కూచూర్ గ్రామాల మ ధ్య గల రాజమోని వంపు దగ్గర, కూచూర్ దగ్గర గల ఆకులోని కుంట దగ్గర, మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చెన్నారెడ్డిపల్లి మధ్య, చె న్నారెడ్డిపల్లి గ్రామం దగ్గర లెంకల చెరువు అలుగు,చెన్నారెడ్డిపల్లి రుక్కంపల్లి గ్రామాల మధ్య,కారూరు గ్రామం నుండి ఇప్పటూరు గ్రామానికి వెళ్లే మార్గంలో కల్వర్టు దగ్గర,కారూర్ గ్రామం ఆంజనేయస్వామి దేవాల యం ముందు రోడ్డుపై చెరువు అలుగునీరు దగ్గర, కిష్టారం ఖానాపూర్ గ్రామాల మధ్య ఉదండాపూర్ రిజర్వాయర్ వెనుక భాగం లో, పెద్దపల్లి వల్లూర్ గ్రామాల మధ్య, ఉదండాపూర్, వల్లూర్ గ్రామాల మధ్య, ఉదం డాపూర్ నుంచి కిష్టారం గ్రామాల మధ్య ఉన్న వాగులలో కల్వర్టులు బ్రిడ్జిలు నిర్మా ణం లేకపోవడంతో తీర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 వర్షం పడితే ఆ ప్రాంతాలలో భయమే...

కాస్త వర్షం పడిన నీరు అత్యధికంగా పాడడంతో రాకపోకలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కిష్టారం అంబఠాపూర్ గ్రామాల మధ్య చెరువు అలుగు నీటి ఉధృతిలో గత సంవత్సరం భార్యాభర్తలు కొట్టుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునర్నిర్మాణాలు కల్వర్టుల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు వేడుకుంటుండ్రు.