1 July, 2026 | 8:01 PM

Breaking News

సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •  

ఆకలితో రాళ్ల బియ్యాన్ని తింటున్న ప్రజలు

28-02-2026 01:04 AM

సంవత్సరాలుగా గడుస్తున్నా పట్టించుకోని ఐటీడీఎ యంత్రాంగం

ఆహార నాణ్యత లోపాల వలన అనారోగ్యాలకి గురవుతున్న ప్రజలు

తక్షణమే మరమ్మతులు  చేపట్టాలి

ఏటూరునాగారం, ఫిబ్రవరి27 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన సహకార సంస్థ(జీసీసీ)డిఆర్ సేల్స్ డిపోలతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఏటూరునాగారంలోని అల్లంవారి ఘణపురంలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ)డిఆర్ సేల్స్ డిపో గత మూడు సంవత్సరాల క్రితం వరదల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతినడంతో డిపోలోని ప్లోరింగ్ పూర్తిగా కృంగిపోయి స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి.

దీంతో అక్కడ నిల్వ ఉంచిన బియ్యం సంచులు ఎలుకలు,పందికొక్కుల వల్ల నాశనం అవుతున్నాయి. ఈ కారణంగా బియ్యంలో మట్టి,రాళ్లు కలసి నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. ఈ డిపోలపై ఆధారపడి సరుకులు తీసుకుంటున్న మూడు గ్రామాల ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యతలేని బియ్యం సరఫరా కావడంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిపోలు తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి  అదేవిధంగా కన్నాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం,సర్వాయి పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది కన్నాయిగూడెంలో కొన్ని గ్రామాల్లో ఉన్న జీసీసీ సెల్స్ డిఫోల మరమ్మతులు చేయాలని ప్రభుత్వం పండు విడుదల చేసింది కాంట్రాక్టర్లు ఇప్పటికే పూర్తి చేయాలి ఇంకా పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

ఉమ్మడి ఏటూరునాగారం మండలంలో ఉన్న జీసీసీ సేల్స్ డిపోలను అధికారులు సందర్శించి వాటి స్థితిగతులు పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

ఎన్హెఆర్సీ ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు జాడి రాజేష్