1 September, 2026 | 9:09 PM

సిపిఎస్ ను రద్దు చేసి ఓపిసి పునరుద్ధరించాలి

01-09-2026 | 07:24pm

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపిసి పునరుద్ధరించాలనీ, పీఆర్సి నీ వెంటనే ప్రకటించాలనీ టియుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్(TUTF District President Srikanth) డిమాండ్ చేశారు.. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) భీంపూర్ మండలం అర్లి(టి) జిల్లా పరిషత్ పాఠశాలలో పెన్షన్ విద్రోహ దినం(Pension Rebellion Day) పురస్కరించుకొని టిజిఈజేఏసి(TGEJAC) ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామం సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ డీఏ వెంటనే చెల్లించాలని, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మూడవ దశ పోరాటంలో భాగంగా సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.