చర్లలో 1000 రోజుల ప్రజా పాలనపై కాంగ్రెస్ ప్రెస్ మీట్
చర్ల,(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Peoples Governance) 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చర్ల మండల కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీపీసీసీ, డీసీసీ మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు విజయ్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్(TPCC State General Secretary Nallapu Durga Prasad), జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
- మహాలక్ష్మి: మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్
- గృహజ్యోతి: 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- ఇందిరమ్మ ఇండ్లు:పేదల సొంతింటి కలకు అండ
- రైతు భరోసా, చేయూత, ఉద్యోగాల భర్తీ ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు






