వైద్య చికిత్సకు ఎల్‌ఓసీ
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం(Burgampadu mandal) సారపాక గ్రామానికి చెందిన వసంత శివ నాగేశ్వరరావు వైద్య చికిత్స కోసం రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) మంగళవారం అందజేశారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగేశ్వరరావు సతీమణి శ్రీదేవికి ఎల్‌ఓసీ పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఎల్‌ఓసీల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎల్‌ఓసీ మంజూరు చేయడంపై శ్రీదేవి, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.






