3 May, 2026 | 4:03 PM

పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలి

03-05-2026 12:00 AM
  1. జీవో నెంబర్ 7ను తక్షణమే ఉపసంహరించుకోవాలి
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మే 2 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం  అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. విద్యార్థుల వద్ద పీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు జారీ చేసిన జీవో నెం.7 ను వెంటనే ఉపసంహరించుకొని పాత పద్ధతినే కొనసాగించా లని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేర కు శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు బకాయిలు 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్ ఒక తీర్పులో విద్యార్థుల వద్ద పీజులు వసూలు చేసుకోవాలని తీర్పు చెప్పిందని, ఆ తరువాత అటు ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత వాపస్ ఇవ్వాలని తీర్పు చెప్పిందన్నారు.

కోర్టు తీర్పు ప్రకారం చాలా కాలేజీలు విద్యార్ధులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. పీజులు వసూలు చేస్తున్నారని, కోర్టు తీర్పు ప్రభావం వలన శ్రీ ఇందు కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వలన ప్రణీత అనే బి టెక్ 3 వ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇదే పరిస్థితి అన్ని కాలేజీలలో ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం జీవో  7ను ఏప్రి ల్ 30న జారి చేసిందని, ఈ జీవో చూడడానికి బాగా నే ఉంది కాని పేద వర్గాల వారు చదువుకోకుండా చేసే కుట్ర ఇందులో ఉందన్నారు. ఈ జీవో ప్రకారం ఫీజులు, స్కాలర్ షిప్ విద్యార్థుల ఖాతాలో వేయాలని ఉందని మండి పడ్డారు. కొత్తగా జారీచేసిన జీవో నెం.7ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.