3 May, 2026 | 2:45 PM

పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ అధికారం

03-05-2026 12:00 AM

మేడ్చల్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు:

రామన్న గారి శ్రీనివాస్‌గౌడ్

మేడ్చల్ అర్బన్, మే 2 (విజయక్రాంతి): భారత దేశ వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అందించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందని ఆయన భీమా వ్యక్తం చేశారు. మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయోనన్న ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తున్నారని బిజెపి సీనియర్ నాయకులు ఆర్ శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. గ్రేటర్ హైదరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్లు గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.