5 May, 2026 | 9:59 PM

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి

05-05-2026 08:38 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి(విజయక్రాంతి): జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో  జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి భూభారతి పెండింగ్ అప్లికేషన్లు సహ సాదాభైనామ అప్లికేషన్ల అంశంపై అన్ని మండలాలు తహసిల్దార్లు ఇతర రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

భూభారతి పెండింగ్ ఫైల్స్ ను కలెక్టర్ లాగిన్ కు పంపడంతో పాటు వాటి ఫిజికల్ ఫైల్స్ కూడా పంపాలని సూచించారు. అలాగే సాదా బైనామా దరఖాస్తులను జీ ఓ 76, 77 ప్రకారం నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములకు సంబంధించి అన్ని మండలాల్లో తహసిల్దార్ ల వద్ద ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేసి ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని 472 డబల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సంబంధిత అధికారులు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, హౌసింగ్ పీడీ విటోభా, అన్ని మండలాల తహసిల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.