22ఏ పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలి
మేడ్చల్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రజలు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్కు వచ్చినప్పుడు అప్డేట్ చేసిన లిస్ట్ ప్రకారం 22A లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ చేసి ట్రాన్సాక్షన్లు సులభంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ రిజిష్ట్రార్, తహాసీల్దార్లను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్, తహాసీల్దార్ కార్యాలయాలలో 22A లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అప్డేట్ చేసిన లిస్ట్ ప్రకారం సేవలు అందిస్తూ, ప్రజలు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్కు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాన్సాక్షన్లు సులభంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునే నాటికి 22ఎ లో వారికి క్లియరెన్స్ ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మేడ్చల్, దుండిగల్ తహాసీల్దార్ల వద్ద ఉన్న 22ఎ జాబితాలో ఉన్న ప్రతి దరఖాస్తును సర్వే నంబరుతో పాటు రిజిస్టరేషన్ కార్యాలయం వారి వద్ద ఉన్న జాబితాతో సరి చూసి కలెక్టర్ పరిశీలించారు. 22A నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్పష్టమైన సూచనలు ఇచ్చారు. లింక్ డాక్యుమెంట్స్ తో వెరిఫికేషన్ చేసుకొని యూ ఎల్ సి కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే జాబితా నుండి క్లియరెన్స్ చేయాలని సూచించారు.
యు ఎల్ సి లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన తొలగించేలా ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 22A (నిషేధిత భూములు) సంబంధించి ఉన్న సమస్యలపై వివరంగా సమీక్షించారు.స్లాట్ బుక్ అయిన తర్వాత పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్లను త్వరగా క్లియర్ చేసేలా సబ్-రిజిస్ట్రార్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రారర్ ఆశోక్, మేడ్చల్ తహాసీల్దారు భూపాల్, దుండిగల్ తహాసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






