20 August, 2026 | 2:50 AM

రైతులు ఆరు తడిపంటలు వేసుకోవాలి

20-08-2026 12:05 AM

మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి         

రేగోడు, ఆగస్టు 19  :  రైతులు వర్షాభావ పంటలు తగ్గించి  ఆరుతడి పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి అన్నారు, బుధవారం మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో పంటలను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వర్షాలు ఉండకపోవచ్చని అందువలన వరి పంటను తగ్గించి,   

ఆరుతడి పంటలైన మినుము, పెసర, కంది, రాగి, సజ్జ, నువ్వుల పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి   రైతులకు సూచిం చారు, ఈ కార్యక్రమంలో ఏఈవో భూలక్ష్మి, సర్పంచ్ సురేందర్, రైతులు పాల్గొన్నారు.