20 August, 2026 | 4:33 AM

పేదోడి ఆవాసం ఇందిరమ్మ ఇండ్లు!

20-08-2026 12:06 AM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య

రాయికోడ్, ఆగస్టు 19 :గూడులేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఆవాసంగా మారుతున్నాయని, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య తెలిపారు. బుధవారం రాయికోడ్ మండలం అల్లాపూర్ గ్రామంలో లబ్దిదారుడు ఉసిరికెపల్లి మల్లన్న, నాగమణికి చెందిన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్  చైర్మన్ సిద్ధన్న పాటిల్, మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేదారనాథ్ పాటిల్, బస్వరాజ్ పాటిల్, ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కులకర్ణి, అల్లాపూర్ సర్పంచ్ చరణ్ కుమార్, కూసునూర్ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్, పండు రంగారెడ్డి, నవీన్, హుల్గేరా సర్పంచ్ నర్సింహా, మాజీ సర్పంచ్ సతీష్, మాజీ ఎంపీటీసీ పండరి, మాజీ యువజన అధ్యక్షుడు ప్రభాకర్, యువజన అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.