ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు సప్పుల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంకాయల గౌతమి–ప్రశాంత్ మాట్లాడుతూ... గ్రామ దేవత ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజిరెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వంకాయల శేఖర్, ఉపాధ్యక్షులు జిట్టవేణి ప్రశాంత్, దండు రవి, సతీష్, భూమయ్య, నెవురి నరేష్, నాంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.




