24 July, 2026 | 4:32 AM

రాహుల్ అరెస్టుపై శాంతియుత నిరసన

24-07-2026 12:00 AM

అలంపూర్, జూలై 23 : లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గురువారం శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. రాజోలి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన నిరసనకు అలంపూర్ మార్కె ట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, మం డల కాంగ్రెస్ అధ్యక్షుడు దస్తగిరి నాయక త్వం వహించారు.

మానవపాడులోని గాంధీ చౌక్లో కూడా నాయకులు శాంతియుత ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎర్రవల్లిలో..

ఎర్రవల్లి, జూలై 23 :  రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మాట్లాడు తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రశ్నించిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్ర జాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.