13-02-2026 07:45:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలను అధికారుల సమన్వయం ప్రజల సహకారం పార్టీల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు