23 March, 2026 | 3:04 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

బీజేసీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలి

23-03-2026 12:00 AM

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ 

ఘట్ కేసర్, మార్చి 22 (విజయక్రాంతి) : భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం2026 ఆదివారం విజయవంతంగా ముగిసింది.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందరరావు ఆదేశానుసారం, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ సూచనల మేరకు, పోచారం డివిజన్ అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రం స్కూల్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఈశిబిరంలో ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈశిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణ విధానం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై నాయకులు, కార్యకర్తలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్ర, జిల్లా నాయకులు తమ మార్గదర్శకత్వాన్ని అందించి కార్యకర్తలను ప్రేరేపించారు.

పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, మహిళా సోదరీమణులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈకార్యక్రమంలో జాతీయ గిరిజన మోర్చా నాయకులు బిక్కునాయక్, రాష్ట్ర నాయకులు రామోజీ, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గొంగళ్ళ బాలేష్, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీ, గోనె శ్రీనివాస్, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, పోచారం డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.