23 March, 2026 | 1:25 PM

ఆరుట్ల వెంకటలక్ష్మీనరసింహారెడ్డి కన్నుమూత

23-03-2026 12:00 AM

నివాళులర్పించిన సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులు

ఎల్బీనగర్, మార్చి 22 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు ఆరుట్ల లక్ష్మీనరసింహరెడ్డి (ఆరుట్ల రామచంద్రారెడ్డి సోదరుడు) మనవడు ఆరుట్ల వెంకట లక్ష్మీనరసింహ రెడ్డి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మన్సూరాబాద్లోని స్వగృహంలో ఉన్న ఆయ న పార్థివ దేహానికి ఆదివారం సీపీఐ జాతీ య, రాష్ట్ర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం తదితరులు నివాళులర్పించారు.  ఆరుట్ల కుటుంబం ఎర్రజెండా కు, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకుని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వీరితోపాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహా, సీనియర్ నాయకులు ఉజ్జయిని రత్నాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి, సమితి సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి  సామిడి శేఖర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, సిపిఐ అబ్దుల్లాపూర్మెట్ కార్యదర్శి అజ్మీరా హార్సింగ్ నాయక్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సామిడి వంశి వర్ధన్ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, హయత్ నగర్  మండల సహాయ కార్యదర్శి మర్రి శోభన్, నాయకులు పాల్వయి సురేందర్, గోల్కొండ నాగరాజు తదితరులు నివాళులర్పించారు.