18-02-2026 01:14:40 AM
ఖానాపూర్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పంచాయతీ రెండో రోజు కూడా తేలలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు, భారత రాష్ట్ర సమితి నాలు గు, బిజెపి నాలుగు, ఇండిపెండెంట్‌లు ఒక స్థానంలో గెలుపొందారు. మొత్తం 12 వార్డు లు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ సభ్యుని పార్టీలోకి చేర్చుకుంది.
దీంతో నాలు గు ప్రధాన పార్టీల అయినా కాంగ్రెస్ బిజెపి భారత రాష్ట్ర సమితికి నాలుగు చొప్పున సమానంగా వార్డులు రావడంతో పొత్తులు కుదరక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రెండో రోజు కూడా వాయిదా పడింది. ఖానాపూర్‌లో ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ బిజె పి, బీఆర్‌ఎస్ ఎవరికి వారే పట్టుపడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో రాజు బేరం కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా పడడం ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందో అనే చర్చ జరుగుతుంది
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మున్సిపల్ లో పొత్తులు పెట్టుకుని ఎలాగైనా మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఖానాపూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీలోకి టిఆర్‌ఎస్ బిజెపి సభ్యులను ఆహ్వానించినప్పటికీ వారు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆ పార్టీలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అగ్రనేతలు ఖానాపూర్ పై దృష్టిపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.
ఖానాపూర్లో ఖానాపూర్‌లో భారత రాష్ట్రపతి బిజెపి పొత్తు పెట్టుకుని ఇరుపాటీలు రెండున్నర ఏళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను రొటేషన్ పద్ధతిలో పంచుకోవాలని ఆ పార్టీ అధినేతలు మహేశ్వర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు, టిఆర్‌ఎస్ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి భారత రాష్ట్రపతి కార్యనిర్వాక అధ్యక్షులు కేటీఆర్ ఎలాగైనా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని లాబింగ్ నిర్వహిస్తున్నారు. ఖానాపూర్ వాయిదా ఎవరికి లాభము ఎవరికి నష్టము ఇప్పట్లో తేలేటట్టు లేదు.
ఎన్నికపై ఉత్కంఠ
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయి దా పడింది. సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక కోరం లేకపోవ డంతో మంగళవారానికి వాయిదా పడగా మళ్ళీ అది కూడా వాయిదా పడింది . మంగళవారం ఉదయం నుంచి స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థుల కోసం ఎదురు చూశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఉదయం కార్యాలయానికి హాజరుకాగా మిగిలిన రెండు పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు రాకపోవడంతో ఈరోజు కూడా కోరం లేదని అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు.