15 May, 2026 | 9:27 PM

Breaking News

శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

15-05-2026 08:27 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో మండలంలోని కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. లోక కళ్యాణార్థమై పెద్ద ఆత్మకూరు గ్రామంలో సుందరమైన శివ దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా త్రయాహిన్యక విధానంలో శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం మూడవ రోజు అట్టాసంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వివిధ పార్టీ నాయకులకు కాలువతో ఘనంగా సన్మానించారు.మూడవరోజు గర్త,బీజ,ధాతు,రత్న, వ్యాసంలు,యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట,ప్రాణ ప్రతిష్ట, జీవకళాన్యాసం,పూర్ణాహుతి, మహాదా శ్రీర్వచనం కార్యక్రమాలు చివరి రోజు నిర్వహించడం జరిగిందనీ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమ్మన్నగారి లక్ష్మి,మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి,మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.