15 May, 2026 | 9:30 PM

Breaking News

దివ్యాంగుల థెరపీ సేవలను సద్వినియోగం చేసుకోండి: డీపీఎం సురేష్ రెడ్డి

15-05-2026 08:41 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమాఖ్య పరిధిలో గల మధర్ ధెరిస్సా దివ్యాంగుల పునరావాస సేవల కేంద్రం నందు బుద్దిమాంద్యత కలిగిన పిల్లల తల్లిదండ్రుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి  డి.ఆర్.డి.ఎ నుండి డి.పి.యం సురేష్ రెడ్డి, స్ధానిక మండల సమాఖ్య ప్రతినిధులు, ఎ.పి.యం, ప్రొఫెషనల్స్, సి.సి సత్తిబాబు మరియు NHC సెంటర్ సిబ్బంది తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా డి.పి.యం మాట్లాడుతూ సెంటర్ ద్వారా అందించే సేవలను ప్రతీ గ్రామంలో అవసరమైన వారి అందరినీ గుర్తిస్తూ సక్రమంగా అంద జేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పధకాలైన‌ దివ్యాంగుల పెన్షన్, ఉపకరణాలు, శస్త్రచికిత్సలు కూడా అవసరమైన వారందరికీ సమయానుకూలంగా చేయించాలని తెలియజేయడం జరిగింది. అలాగే హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి నిపుణులు ద్వారా అందించే థెరపీ సేవలను సక్రమంగా సెంటర్ కు హాజరై వినియోగించుకోవడం వలన దివ్యాంగులైన పిల్లలు భవిష్యత్తులో ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించవచ్చని తెలియజేయడం జరిగింది.