15 May, 2026 | 9:31 PM

Breaking News

వడదెబ్బతో ఆదివాసీ నాయకుడు మృతి

15-05-2026 08:36 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శుక్రవారం మండల కేంద్రంలోని అర్బన్ కాలనీ కి చెందిన ఆదివాసీ నాయకుడు సోయం రామ్మూర్తి (60) వడదెబ్బ తగిలి కన్నుమూశారు. సిఎం రామ్మూర్తి గత 2 రోజులుగా ఆదివాసీ సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వగా, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయన మరణంపై ఆదివాసీ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.