15 May, 2026 | 9:27 PM

Breaking News

యువతి యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

15-05-2026 08:34 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుమూల సువాసిని రెడ్డి.!!

శివంపేట,(విజయక్రాంతి):  శివంపేట మండల కేంద్రంలోని శాఖ గ్రంధాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి లో భాగంగా మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా 15వ తేదీ రోజున గ్రంథాలయ దినోత్సవం గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజు శివంపేట శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిలుముల సువాసన రెడ్డి హాజరైనారు. జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శివంపేట గ్రంధాలయ పాలకురాలు డి అర్చన ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను స్థానిక సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్, ఉప సర్పంచ్ ఇసుగారి మల్లేశం శివంపేట గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులతో కలిసి పుస్తక ప్రదర్శనను తిలకించారు.  స్థానిక సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్,ఉప సర్పంచ్ ఇసుగారి  మల్లేశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డిని ఘనంగా శాలువా తో సన్మానించారు.

అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రంథాలయ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని అన్నారు. గ్రంధాలయాలలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు, సాహిత్యం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, నూతన వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పలు పుస్తకాలు గ్రంథాలయంలో ఉంటాయని అన్నారు.

అనంతరం స్థానిక సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నేటి యువతీ యువకులు సమయాన్ని సెల్ ఫోన్ కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. పుస్తకం చదవడంతో ఎన్నో విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బుచ్చ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, స్థానిక సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్, ఉప సర్పంచ్ ఇసు గారి మల్లేశం, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, శివంపేట గ్రంధాలయ  శాఖ గ్రంధాలయ పాలకులు, డి అర్చన, యాదగిరి, శాఖ గ్రంధాలయమునకు విచ్చేసిన పాఠకులు తదితరులు పాల్గొన్నారు.