ఘనంగా పర్సా వర్ధంతి
దమ్మపేట, మే 22 (విజయ క్రాంతి): కార్మిక ఉద్యమాలనే తన ఊపిరిగా మలుచుకున్న మహనీయుడు పరస సత్యనారాయణ అని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. పర్సా సత్యనారాయణ 11వ వర్ధంతి సిఐటియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన పర్సా సత్యనారాయణ తను చేస్తున్నది చిన్నపాటి ఉద్యోగం అయినప్పటికీ సాటి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని వేలాది ఎకరాల భూమిని రైతులకు సాధించి పెట్టారని అన్నారు.
ఈ పోరాటాల క్రమంలో అజ్ఞాత జీవితాం, పోలీసుల లాఠీ దెబ్బలు తట్టుకొని కార్మిక వర్గ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని, పర్స సత్యనారాయణ జీవితాంతం పోరాటం, త్యాగాలమయమేనని, తను కోరుకున్నది దోపిడీ లేని సమసమాజమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, శేషుబాబు, విజయలక్ష్మి యశోద, పద్మ, నరసమ్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






