17 August, 2026 | 3:06 AM

సాయివైభవ్ కాలనీలో రూ.2.90 కోట్లతో పార్కు అభివృద్ధి

17-08-2026 12:56 AM

శేరిలింగంపల్లి,ఆగస్టు 16 (విజయక్రాంతి): సాయి వైభవ్ కాలనీలో రూ.2.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కు అభివృద్ధి, సుందరీకరణ పనులకు పీ ఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ఆయన కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాంధీ మా ట్లాడుతూ పార్కును ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దడంతో పాటు పచ్చద నాన్ని పెంచుతామన్నారు.

పార్కులో ఓపెన్ జిమ్, మొక్కలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలు, వృద్ధులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటిలో, పార్కు పరిసరాల్లో ఇంకుడు గుం తలు ఏర్పాటు చేయాలని సూచించారు.అభివృద్ధి పనులను నాణ్యతతో, జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గాంధీ తెలిపారు.కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.