బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి
18 రోజుల పసికందును అమ్మిన కన్నపేగు
నలుగురు ఆడపిల్లలను పోషించలేక విక్రయం
ఐదుగురిపై కేసు నమోదు చేసిన సీఐ శ్రీధర్
బాన్సువాడ,(విజయక్రాంతి): నేటి సమాజంలో బంధాన్ని... బాధ్యతను మరుస్తూ కన్న పేగు అని మానవత్వం చూపకుండా ఆడపిల్ల పుట్టిందని అమ్మకానికి పెడుతూ పసికందు అని చూడకుండానే విక్రయిస్తున్నారు. ఇలాంటి అమానుష ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ సోమేశ్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ నాలుగో సంతానం కూడా ఆడ శిశువే జన్మించడంతో, పోషించలేక 18 రోజుల శిశువును లక్ష రూపాయలకు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన మహిళ కు విక్రయించినట్లు తల్లి కిష్టవ్వ తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలు ఉండగానే మరో కాన్పు ఆడపిల్ల జన్మించడంతో నలుగురు ఆడ పిల్లలను పోషించలేక నాలుగవ పాపను అమ్మినట్లు తల్లి తెలిపింది. ఈ విషయమై బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాగా విచారణ చేపట్టిన అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తుల శ్రీధర్ తెలిపారు.




