1 April, 2026 | 4:53 PM

తెలంగాణలో పారాక్వాట్ గడ్డిమందు నిషేధం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

01-04-2026 03:17 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు విక్రయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పారాక్వాట్ నిషేధంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ లో ప్రభుత్వం తీర్మానం చేసింది. పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లఘించిన వ్యాపారులపై చర్యలుతీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.