1 April, 2026 | 4:16 PM

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌

01-04-2026 02:23 PM

న్యూఢిల్లీ: అమరావతి చట్టబద్ధత బిల్లుకు(Amaravati Legalization Bill) లోక్ సభ ఆమోదం తెలిపింది. రేపు అమరావతి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేయనుంది. అనంతరం బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

అమరావతి చట్టబద్ధత బిల్లుపై 2 గంటలకుపైగా చర్చ సాగింది. ఏపీ రాజధాని నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారని వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ తరహా బిల్లుకు వ్యతిరేకమని పేర్కొన్నారు.  అమరావతి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు వాకౌట్‌ చేశారు. ''మేం అమరావతికి వ్యతిరేకం కాదు.. ఈ తరహా బిల్లుకు వ్యతిరేకం". అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.