31 August, 2026 | 4:03 PM

ప్రజావాణికి అధికారుల డుమ్మా...సిబ్బందితోనే సరి

31-08-2026 03:11 PM

అధికారులు లేకుంటే సమస్యలు ఎవరికి చెప్పాలి

ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల ఆగ్రహం

బాన్సువాడ, ఆగస్టు 31 (విజయ క్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల స్థానంలో సిబ్బంది మాత్రమే హాజరు కావడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. సమస్యలను స్వయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తే సిబ్బందితోనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఏమిటని మండిపడ్డారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాల్సిన అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.