1 August, 2026 | 2:57 AM

ప్యారడైజ్ టీజర్ సిద్ధం!

01-08-2026 02:02 AM

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ మూవీ ‘ది ప్యారడైజ్’పై మొదట్నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్‌బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌తోపాటు, చిత్రంలోని తొలి పాట ‘ఆయా షేర్..’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తో సినిమాపై నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది.

1 నిమిషం 35 సెకన్ల నిడివితో విడుదల కానున్న ఈ టీజర్‌లో సినిమా వరల్డ్‌తోపాటు కథలోని ఎమోషనల్ ఇంటెన్సిటీని చూపించబోతున్నారు. మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: సీహెచ్ సాయి; సంగీతం: అనిరుధ్ రవిచందర్; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.