25 April, 2026 | 3:24 AM

పంచాయతీలే దేశానికి వెన్నెముక

25-04-2026 01:46 AM

ఎంపీడీవో జయరాం నాయక్

నవాబ్పేట, ఏఫ్రిల్ 24 : పంచాయతీలే దేశానికి వెన్నెముకను ఎంపీడీవో జయరాం నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం తో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జయరాం నాయక్ మాట్లాడుతూ స్థానిక స్వపరిపాలన ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.  ప్రతి గ్రామం లో పారదర్శకమైన పాలన అందించేందుకు పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.