రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అండగా నిలవాలి
ఫ్యాక్స్ ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): రైతుల అభివృద్ధికి సహకర సంఘాలు అండగా నిలవాలి అని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నాడు, శుక్రవారం ఇల్లంతకుంట మండలం ఫ్యాక్స్ చైర్మన్ గా ఊట్కూరి వెంకట రమణ రెడ్డి, వైస్ చైర్మన్ గా యాస తిరుపతి, 12 మంది డైరక్టర్ లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సహకార సంఘలు నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం పని చేయాలి అని అన్నాడు, సకాలంలో రైతులకు ఎరువులు రుణాలు అందేలా చూడాలి అని అన్నాడు.
పండించిన పంటలను దళారుల పాలు అవకుండా చూడాలి అన్నాడు. ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్,వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపాడు,సొసైటీని అభివృద్ధి లో అగ్రగామిగా నిలపాలి అని అన్నాడు, ఒకప్పుడు చైర్మన్ ఎన్నిక కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు అని కానీ ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చైర్మన్ మరియు పాలకవర్గం నామినేటెడ్ పద్దతిలో ఎన్నిక కావడం వలన సహకార సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తాయి అన్నాడు,ఫ్యాక్స్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన రమణ రెడ్డి ,వైస్ చైర్మన్ తిరుపతి లు తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ రాజు,మరియు సర్పంచ్ లు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,






