14 August, 2026 | 9:30 PM

సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?

14-08-2026 08:21 PM

- స్పష్టికరించాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణిలో గ్యాస్ కేషన్ వల్ల కార్మికులకు, సింగరేణికి ఎలాంటి ప్రయోజనమో స్పష్టంగా చెప్పాలని సింగరేణి గని కార్మిక సంఘం (ఎస్జీకేఎస్), రాష్ట్ర నాయకులు మహేందర్, ఏఐఎఫ్టీయూ పోచమల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భూగర్భంలోని బొగ్గును సంప్రదాయ పద్ధతిలో తవ్వకుండా, అక్కడే నియంత్రిత విధానంలో గ్యాస్‌గా మార్చి, ఆ గ్యాస్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసే గ్యాస్‌ఫికేషన్‌ విధానం కార్మికులకు నష్టమా లాభమా  చెప్పాల్సిన బాధ్యత సింగరేణి కంపెనీపై ఉందన్నారు.

సింగరేణిలో గ్యాస్ గ్యాస్ పీకేషన్ అమలు చేస్తే కార్మిక వర్గంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నదన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గి సంస్థకు లాభాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, బొగ్గు తవ్వకంలో కార్మికుల అవసరం తగ్గితే ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందనీ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల గ్యాస్‌ఫికేషన్‌ వల్ల సంస్థకు వచ్చే లాభాల్లో కార్మికుల ప్రయోజనాలను కాపాడేలా ప్రభుత్వం, యాజమాన్యం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలనీ పేర్కొన్నారు. ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆ ప్రకటనలో సింగరేణి గని కార్మిక సంఘం (SGKS) రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్ AIFTU రాష్ట్ర నాయకులు M. పోచమల్లు యాజమాన్యాన్ని కోరారు.