09-02-2026 02:33:36 AM
ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిలాండ్ విజయం
చెన్నై, ఫిబ్రవరి 8 : టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ విజ యం సాధించింది. ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మొదట బ్యా టింగ్‌లో మెరుపులు మెరిపించిన ఆప్ఘన్లు తర్వాత బంతితోనూ రాణించారు. అయితే కివీస్ బ్యాటర్లు సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ కౌంటర్ ఎటాక్‌తో ఆప్ధనిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టుకు కివీస్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లు గుర్బాజ్(27), జడ్రాన్(10) పవర్ ప్లే పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. ఈ దశలో బ్యాటింగ్‌కువచ్చిన గుల్బదిన్ నైబ్ చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా సెదికుల్లా అటల్ బాధ్యతాయుతంగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు రెండో ఓవర్లోనే ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ చుక్కలు చూపించాడు. వరుస బంతుల్లో ఫిన్ అలెన్, రచిన్ రవీంద్రలను అవుట్ చేసి కివీస్‌ను దెబ్బ కొట్టాడు. ఈ దశలో టిమ్ సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ జోడి ఆడుకుంది. సీఫెర్ట్ కేవలం 42 బంతుల్లో 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్స్ కూడా 25 బంతుల్లో 42 పరుగులతో మెరుపులు మెరిపించడంతో కివీస్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్, ముజీబ్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచినప్పటికీ, కివీస్ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. మార్క్ చాప్మన్ విలువైన పరుగులు జోడించగా.. చివర్లో డారిల్ మిచెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ధాటిగా ఆడటంతో కివీస్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో 175 కంటే ఎక్కువ పరుగులు చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే ఆఫ్ఘ్ప టీ20ల్లో ఇదే అత్యంత విజయవంతమైన రన్ చేజ్ గా రికార్డులకు ఎక్కింది.