8 August, 2026 | 4:18 PM

పద్మశాలి సంఘం ఎన్నికలు

08-08-2026 03:00 PM

బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా,బోథ్ తాలూకా స్థాయి పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం రోజున నిర్వహించనున్నారు. మండల కేంద్రంలోని నాగభూషణం పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పద్మశాలి సంఘం సభ్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని బోథ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మెరుగు భోజన్న కోరారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై విస్తృతమైన ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రచారాన్ని పూర్తిచేసి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ సభ్యులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు పిలుపునిచ్చారు.