అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానం
26-05-2026 12:50 AM
- రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందజేత
- ముగ్గురు తెలంగాణవాసులకు కూడా పురస్కారాలు
న్యూఢిల్లీ, మే 25(విజయక్రాంతి) : దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.
మొత్తం 131 మందికి ఈ అవార్డులు దక్కగా.. అందులో ముగ్గురు తెలంగాణవాసులు కూడా ఉన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి.వెంకట్రావుకు, క్యాన్సర్ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందించారు.






