24 August, 2026 | 3:13 AM

మా రాముడు అందరివాడు

24-08-2026 12:00 AM

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. ఈ సినిమాకు యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరాములు, స్వాతి మందాడి, అనుముల లక్ష్మణరావు, సుమన్, బాహుబలి ప్రభాకర్, నాగ మహేశ్, అప్పారావు, సమ్మెట గాంధీ, గడ్డం నవీన్, ఆనంద్ భారతి, చిట్టి బాబు, గోల్ రెడ్డి, బేబీ గనిష్క రంద్రంక్షి ముఖ్య పాత్రల్ని పోషించారు.

ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ కలియుగంలోనూ హనుమంతుడు మానవ జాతికి దిశానిర్దేశం చేస్తుంటారు. ప్రకృతి అనే అమ్మాయికి హనుమాన్ ఎన్నెన్నో కథలు చెబుతుంటారు. అందులో భాగంగానే రాముడి కథను చెప్తారు. సొంత ఊరిని వదిలేసి రాముడు అడవుల్లోకి జీవనం కొనసాగిస్తుంటారు. ఊరిలో హాస్పిటల్ కట్టించాలని పోరాడే తన తండ్రి ఆశయాన్ని గుర్తెరిగిన రాముడు.. తన తప్పు తెలుసుకుని ఊరికి తిరిగి వస్తాడు.

ఊరికి తిరిగి వచ్చిన రాముడు చేసిన పనులు ఏంటి? ఊరిలోని చెడును ఎలా నిర్మూలించాడు? ఊరిని ఎలా తీర్చిదిద్దాడు? అన్నదే కథ. ప్రకృతి వర ప్రసాదమైన ఓ బిడ్డకు ఈ కథను హనుమంతుడు వివరిస్తుంటాడు. ఇందులో హనుమంతుడి పాత్రకు గానూ తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాకు మనీష్ కుమార్ స్వరాలు సమకూర్చుతుండగా, బొల్ల వెంకటేశ్ బీజీఎం అందించారు. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలుండగా.. నజీర్ ఉద్దీన్, గీతామాధురి, రమ్య బెహరా, నల్గొండ గద్దర్, మనీష్ కుమార్ ఆలపించారు.